News

బాణ‌సంచాపై కోల్‌క‌తా హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టు

689views

న్యూఢిల్లీ: ఈ ఏడాది బాణసంచాను పూర్తిగా నిషేధించాలని కోల్​కతా​ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. టపాసులను రాష్ట్రంలోకి దిగుమతి చేసుకోకుండా ప్రవేశమార్గాల వద్దే నిలువరించే చర్యలను పరిశీలించాలని సూచించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్​, జస్టిస్​ అజయ్ రస్తోగితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. దీపావళి, కాళీ పూజ, ఛఠ్​ పూజ, జగధాత్రి పూజ, గురునానక్​ జయంతి వంటి ఉత్సవాల్లో బాణసంచా కాల్చకుండా నిషేధం విధిస్తూ అక్టోబర్​ 29న ఆదేశాలిచ్చింది కోల్​కతా హైకోర్టు.

కరోనా నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మైనపు, నూనె దివ్వెలను మాత్రం వెలిగించుకోవచ్చని చెప్పింది. ఈ ఆదేశాలను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​ను సుప్రీం ధర్మాసనం సోమవారం విచారిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి