
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సంక్షోభం అంచుకుచేరుకుంది. దీంతో దసరా తర్వాత ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ కోతలు అమలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ శాఖ మంత్రితోపాటు అధికారులు జారీచేసిన ప్రకటనలు అటువంటి సంకేతాలు ఇస్తున్నాయి.
బొగ్గుకొరతతో రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సుమారు 40 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ఉన్నతాధికారులు ప్రకటించారు. అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటిరెండు రోజులకు సరిపడేంత బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంతో రైల్వే ర్యాక్‌ల సంఖ్య పెరిగినప్పటికీ చాలాచోట్ల కోతలు గంటల తరబడి తప్పడంలేదు.
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి రోజూ నాలుగు గంటలపాటు పరిశ్రమలకు విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు వాడవద్దని ఇంధన శాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
Source: Nijamtoday





