News

లఖీంపూర్‌ ఖేరీ మృతులకు రూ. 45 లక్షల పరిహారం

567views
  • బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీలో చనిపోయిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున పరిహారాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడ్డవాళ్లకు 10 లక్షల చొప్పున సాయం ప్రకటించారు.

లఖీంపూర్‌ ఖేరీలో ఆదివారం రైతుల ఆందోళనల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న విపక్ష సభ్యులను ఎక్కడికక్కడే ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. పోలీసులు.. బారికేడ్లు, వాహనాలను అడ్డుగా పెట్టి భారీగా బలగాలను మోహరించారు. లఖీంపూర్‌ఖేరీలో 144 సెక్షన్‌ విధించారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

లఖీంపూర్‌ ఘటనతో ఢల్లీిలోనూ ఆంక్షలు విధించారు. సింఘు, ఘాజీపూర్‌ సరిహద్దులను మూసివేశారు. లఖీంపూర్‌ఖేరీలో రైతులకు మద్దతుగా వెళ్లిన కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణమేర్పడిరది. లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుండగా అఖిలేష్‌ను ఇంటివద్దే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీసుల తీరుకు నిరసనగా పెద్ద సంఖ్యలో సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.

లఖీంపూర్‌ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై కారు నడిపారన్న ఆరోపణలపై కేంద్రమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఆశిష్‌ మిశ్రా సహా 14 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా స్పందిస్తూచి ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఘటనా స్థలిలో తన కుమారుడు లేడని అన్నారు. అక్కడ తన కొడుకు ఉంటే ప్రాణాలతో బయటపడేవాడు కాదని చెప్పారు. డిప్యూటీ సీఎం కార్యక్రమం జరుగుతున్న వేదిక వద్ద నా కొడుకు ఉన్నాడని.. తాను కూడా డిప్యూటీ సీఎం పక్కనే ఉన్నానని తెలిపారు.

రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌తో కలిసి యూపీ పోలీసులు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ను నిర్వహించారు. నేరస్తులు ఎలాంటి వారైనా.. ఎటువంటి వారైనా సరే తప్పకుండా కఠిన శిక్షను అనుభవిస్తారని ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించారు. బాధ్యులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. లఖీంపూర్‌ ఖేరీలోకి రాజకీయ ప్రముఖులెవరికీ అనుమతి లేదని జిల్లా అధికారులు ఇంతకు ముందే తెలియజేశారని ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. మరణించిన వారి పోస్టుమార్టం చట్టపరమైన విధానాల ప్రకారం జరుగుతుందని, ఆ తర్వాత వారి అంత్యక్రియలు నిర్వహించనున్నామని ఆయన చెప్పారు.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి