News

నిజమైన ఐక్యతే… నిజమైన బలం

145views
  • ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌

జమ్మూ-కశ్మీర్‌: మన బలం.. మన ఐక్యతతోనే ఎదుటవారికి తెలుస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో తన నాలుగు రోజుల పర్యటన ముగింపు రోజున కేశవ్‌ భవన్‌, అంబ్‌ఫల్లా జె అండ్‌ కె నుండి ఆన్‌లైన్‌ ద్వారా స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు, ప్రపంచవ్యాప్తంగా దాని నెట్‌వర్క్‌, విస్తరణ వంటి వివిధ అంశాలతోపాటు వ్యక్తిత్వం నిర్మాణం, జాతి నిర్మాణం, దేశం ముందు సవాళ్లను నొక్కి వక్కాణించారు.

2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడి వందేళ్ళు పూర్తి చేసుకోబోతోందని, ఈ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. శత జయంతి ఉత్సవాల నాటికి ప్రతీ ఇంటికి సంఘ్‌..  స్వయంసేవకుల ద్వారా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇది స్వయంసేవకుల లక్ష్యమని అన్నారు. అన్ని గ్రామాలకు శాఖలు విస్తరణతోనే ఈ లక్ష్యం చేరుకోగలమన్నారు.

స్వయంసేవకులకు… వారి ప్రవర్తన ఎలా ఉండాలో, వారి జీవితాలు జాతి నిర్మాణానికి ఎలా అంకితం కావాలో మోహన్‌ జీ సలహా ఇచ్చారు. ‘మేము 96 ఏళ్ళుగా అదే పని చేస్తున్నాము. మేము దృష్టిని మరల్చకుండా మరింత ఉత్సాహంతో చేయాలి’ అని అన్నారు. సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, నిజమైన ఐక్యతే నిజమైన బలం అని ఆయన అన్నారు. ‘మన బలం మన ఐక్యత ద్వారా మాత్రమే తెలుసుకుంటారు…. మనం ఐక్యంగా ఉండాలి’ అని భగవత్‌ అన్నారు. నాగపూర్‌లో సంఘ్‌ ప్రారంభ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ హెడ్గేవార్‌ ఉదాహరణలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

భారతదేశాన్ని విశ్వ గురువుగా చేయగలిగే మొత్తం హిందూ సమాజాన్ని తయారుచేయాల్సివుంటుందన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలని భగవత్‌ అన్నారు. ప్రపంచంలోని ప్రతి రంగంలో భారతదేశం ముందంజలో ఉండాలి… మనం కూడా ప్రపంచం మొత్తాన్ని నడిపించే స్థితిలో ఉండాలి… అలాంటి దేశాన్ని మనం సృష్టించాలి… అది మన అంతిమ లక్ష్యం కావాలి… పని ఇప్పుడే ప్రారంభమైంది, పూర్తి కాలేదు. కాబట్టి, సహనంతో పనిచేయడం చాలా ముఖ్యం’ అని ఆయన అన్నారు.

భౌతికంగా, మేధోపరంగా, సంస్థాగతంగా బలంగా ఉండడం ముఖ్యం… కనుక క్రమం తప్పకుండా శాఖలకు హాజరు కావాలని సర్‌ సంఘ్‌చాలక్‌ సూచించారు. ‘ప్రతి స్వయంసేవక్‌ తన కర్తవ్యాన్ని అంకితభావంతో, నిబద్ధతతో నిర్వర్తించాలి’, అని ఆయన అన్నారు. పాత్ర నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణం అవసరాన్ని వివరించారు. పాత్ర నిర్మాణానికి, ప్రాముఖ్యత ఇవ్వడానికి మోహన్‌ జీ రామాయణంలోని కొన్ని అంశాలను ఉదాహరణలుగా చెప్పాడు. ‘ఒక స్వయం సేవకుడు మొత్తం సమాజానికి ఒక ఉదాహరణగా ఉండాలి’ అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జమ్మూ-కశ్మీర్‌లోని 989 ప్రదేశాల నుండి స్వయంసేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఉత్తర క్షేత్రానికి చెందిన సంఘచాలక్‌ ప్రొఫెసర్‌ సీతారామ్‌ వ్యాస్‌ జీ, జమ్మూ-కశ్మీర్‌ ప్రావిన్స్‌ సహ-సంఘ్‌చాలక్‌, డాక్టర్‌ గౌతమ్‌ మైంగి జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Source: VskBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి