News

ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి!

585views
  • ఎస్‌సీఓ సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి నెలకొంటుందని, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. షాంఘై సహకార సంస్థ(Shanghai Cooperation Organisation(SCO)) 20 వార్షికోత్సవంలో మోడీ కీలక ప్రసంగం చేశారు. SCOలో కొత్తగా ఇరాన్‌ చేరడాన్ని స్వాగతించారు.

చర్చా భాగస్వాములుగా చేరిన సౌదీ అరేబియా, ఈజిప్ట్‌, కతర్‌కు కూడా స్వాగతం పలికారు. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న తీవ్రవాదం ప్రపంచ శాంతికి అడ్డుగా నిలుస్తోంద‌ని ప్రధాని మోడీ అన్నారు. షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో వర్చువల్‌ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, గ్రూపులోని సభ్యులంతా కనెక్టివిటీ, నమ్మకం లాంటి అంశాలపై పరస్పరం పనిచేయాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని.. అక్కడ రాడికలైజేషన్‌, తీవ్రవాదం పెరగకుండా చూడాల్సిన బాధ్యతను SCO సభ్య దేశాలపై ఉందన్నారు.

సెంట్రల్‌ ఏషియా చరిత్రను పరిశీలిస్తే, అక్కడ ప్రగతిశీల సంస్కృతులు, విలువలు సమ్మిళితం అయ్యాయని ప్రధాని మోడీ అన్నారు.  కొన్ని శ‌తాబ్దాల‌ పాటు సూఫిజం ఇక్కడ వర్ధిల్లిందన్నారు. ఆసియా ప్రాంతమంతా అది వ్యాపించిందని, ఇక్కడ ప్రాంతీయ సంస్కృతుల్లో ఆ పద్ధతులను చూడవచ్చు అని తెలిపారు.

సెంట్రల్‌ ఏషియాలో ఉన్న చారిత్రక వారసత్వాన్ని పరిశీలిస్తే, ఎస్సీవో సభ్యదేశాలు తీవ్రవాదంపై కలిసి పోరోడాల్సి వస్తోందని మోదీ అన్నారు. ఇండియాతో పాటు అన్ని ఎస్సీవో సభ్యదేశాల్లో ఇస్లామ్‌తో అనుబంధం కలిగి ఉన్న ఎన్నో ఇన్స్‌టిట్యూషన్లు ఉన్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. కాగా, షాంఘై సహకార సంస్థ 2001లో ఏర్పాటైంది. కజకిస్తాన్‌, చైనా, కిర్గిస్తాన్‌, రష్యా, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ఇండియా, పాకిస్థాన్‌, ఇరాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. పొరుగు సంబంధాలను, పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఎస్సీవోను ప్రారంభించారు.

Souirce:Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి