
-
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(2021-23)లో భారత్‌కు అగ్రస్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(2021-23) పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌పై రెండు విజయాలను కైవసం చేసుకున్న భారత్, పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి 26 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరింది. డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా అందులో రెండు మ్యాచ్‌ల్లో గెలుపు, ఓ మ్యాచ్‌లో ఓటమి, మరో మ్యాచ్ డ్రా చేసుకుకోవడం ద్వారా 54.17 విజయాల శాతం నమోదు చేసింది.
ఆగస్ట్‌లో జరిగిన విండీస్ పర్యటనలో ఒక టెస్ట్‌ను కోల్పోయి మరో మ్యాచ్‌లో గెలుపొందిన పాక్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. విండీస్ కూడా ఇదే గణాంకాలు నమోదు చేసి, పాక్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ జట్టు 14 పాయింట్లు ఖాతాలో వేసుకుని 29.17 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
Source: NationalistHub





