News

వాయుసేనకు 56 రవాణా విమానాలు

790views
  • స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారీ

  • దేశంలోనే తొలి ప్రాజెక్టు

  • ఆమోదించిన కేంద్ర మంత్రి మండలి

న్యూఢిల్లీ: భారత వాయుసేన కోసం విమానాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 56 సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. స్పెయిన్‌ నుంచి 16 రవాణా విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించిన కేంద్రం.. మిగతా 40 విమానాలను భారత్‌లోనే స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో తయారీ చేయనున్నట్టు ప్రకటించింది.

భారత్‌లో తయారీ, స్వదేశీ సామర్థ్యం పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులువేస్తోంది. ఈ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసిన 48 నెలల్లో స్పెయిన్‌ నుంచి విమానాలు పంపిణీ జరగనుంది. మిగతా 40 విమానాలు మాత్రం భారత్‌లో టాటా కన్సార్టియం 10 ఏళ్ల లోపు ఉత్పత్తి చేయనుంది. సైనిక విమానాన్ని భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసే తొలి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.

స్వదేశీ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సూట్‌తో రూపొందుతున్న ఈ రవాణా విమానాల తయారీ ఉపాధి కల్పనలో ఓ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్రం తెలిపింది. ఏరోస్పేస్‌ ఎకో సిస్టమ్‌లో ప్రత్యక్షంగా అత్యంత నైపుణ్యం కలిగిన 600 ఉద్యోగాలు, పరోక్షంగా 3వేలకు పైగా ఉద్యోగాలతో పాటు అదనంగా మరో మూడు వేల ఉద్యోగావకాశాలు కలగనున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి