News

ఇండోర్‌లో ల‌వ్ జీహాద్‌? పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన‌ భజరంగ్ దళ్

622views

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ న‌గ‌రంలో ఓ యువ‌తి మైన‌ర్ ప్రేమికుడి వ‌ల‌లో చిక్కుకొని ల‌వ్ జీహాద్ అంచుల వ‌ర‌కూ వెళ్ళింది. అదృష్ట‌వ‌శాత్తు ఈ సంగ‌తి అక్క‌డి భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌ల‌కు తెలియ‌డంతో వారు రంగంలోకి దిగారు. అమ్మాయి తల్లి మామ సత్వాస్‌లో నివసిస్తున్నారు. ఆ యువ‌తి అక్క‌డికి కొన్ని రోజుల క్రితం వెళ్లింది. ఈ సమయంలో ఓ మైన‌ర్ యువ‌కుడు యువ‌తితో ప‌రిచ‌యం పెంచుకుని, వ‌ల‌పు వ‌ల‌లో బంధించాడు. ఆ తర్వాత, అమ్మాయి స్వ‌గ్రామానికి వెళ్లినప్పుడు, ఆ యువకుడు కూడా ఆమెను ఇండోర్‌కు అనుసరించాడు. ఈ సమయంలో ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. కొద్ది రోజుల‌ త‌ర్వాత అమ్మాయి అకస్మాత్తుగా ఇంటి నుండి అదృశ్యమైంది. సత్వాస్‌లో నివసించే యువకుడు ఆమెతో మాట్లాడేవారని కుటుంబానికి తెలిసింది. దీంతో వారు, బంధువులు బజరంగ్ దళ్‌కు సమాచారం అందించారు.
భజరంగ్ దళ్ కన్వీనర్ తనూ శర్మ చొరవతో, ఆజాద్ నగర్ పోలీసులు వారి వద్దకు చేరుకున్నారు. యువకుడు, ఆ యువ‌తి ఆజాద్ నగర్ ప్రాంతంలోని అద్దె గదిలో నివసిస్తున్నారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించిన తర్వాత విడిచిపెట్టేశారు. కాగా, వేరే మ‌తానికి చెందిన ఆ యువ‌కుడు యువతిని మతం మార్చేందుకు కుట్ర చేస్తున్నాడని భజరంగ్ దళ్ సభ్యులు పోలీసుల వ‌ద్ద ఆరోపించారు. ఆ యువ‌కుడి వ‌ద్ద మూడు వేర్వేరు మ‌తాల‌తో కూడిన ఆధార్ కార్డులు ఉన్నాయ‌ని, వాటిలో పేరు, వయస్సు , మతం భిన్నంగా ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. కేసు ద‌ర్యాప్తులో ఉంది.

SOURCE: SAMVAD

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి