News

దేశీయ ఎడ్లతో జల్లికట్టుకు ఓకే : మద్రాస్ హైకోర్టు

878views

మిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో దేశీయ జాతుల ఎడ్లను మాత్రమే ఉపయోగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దిగుమతి చేసుకున్న, హైబ్రిడ్, సంకర జాతులను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పశువుల కృత్రిమ గర్భధారణ ప్రక్రియ అనేది వాటిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడం లాంటిదేనని తెలిపింది. సహజ సంతానోత్పత్తి ప్రక్రియ వాటి ప్రాథమిక అవసరం అని, ఈ విషయంలో మనుషులు జోక్యం చేసుకోకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో ప్రభుత్వం జల్లికట్టును నిషేధించే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో కోర్టు అందుకు అనుమతించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.