News

పాకిస్థాన్ లో జీహాద్ తప్పనిసరి… షరియా చట్టాలూ అమలు చేస్తాం.. పాకిస్తాన్ తాలిబన్ల వ్యాఖ్య

739views

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత కాబుల్‌ జైళ్ల నుంచి తమ ఖైదీలు విడుదల అవుతున్న వీడియోను తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) విడుదల చేసింది. 11 నిమిషాల వీడియోలో అమెరికాను ఓడించినందుకు అఫ్గాన్ తాలిబాన్లపై టీటీపీ ప్రశంసలు కురిపించింది.

పాకిస్తాన్‌లో జిహాద్‌ తప్పనిసరి అని, అఫ్గానిస్తాన్ రక్షణ కోసం తప్పకుండా కొనసాగించాలని నొక్కి చెప్పారు. పాశ్చాత్య దేశాలు చెప్పినట్టల్లా ఆటలాడే పాకిస్థాన్ అవినీతి నాయకులకు మనం వ్యతిరేకులం అని పేర్కొన్నారు. పాకిస్థాన్ అణు శక్తి, మిలటరీ దళం ‘మతభ్రష్ట’ అధికారాల కోసం కాకుండా ముస్లిం సమాజానికి అనుగుణంగా పని చేయాలని సూచించారు. అఫ్గానిస్థాన్ ‌లో అమలవుతున్న షరియా లాంటి వ్యవస్థను పాకిస్థాన్ ‌లోనూ తీసుకొచ్చేందుకు పోరాడాలని పాకిస్థానీ జిహాదిస్టులకు పిలుపునిచ్చారు.

చివర్లో, పాకిస్థాన్ నుంచి వచ్చిన జిహాదిస్టులకు ఆశ్రయం కల్పించిన స్థానికుల పట్ల కృతజ్ఞతా భావంతో మెలగాలని కునార్లోని టీటీపీ సభ్యులకు సూచించారు. స్థానిక విషయాల్లో జోక్యం చేసుకోరాదని, పెద్దలను గౌరవించాలని వారిని కోరారు.

అయితే, పాకిస్థాన్ ‌కు వ్యతిరేకంగా టీటీపీ కార్యకలాపాలను తమ దేశంలో అనుమతించబోమని, అఫ్గాన్ తాలిబన్లు తమ ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.