
548views
తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ – ఐఎస్ గ్రూప్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఐఎస్ మిలిటెంట్ చనిపోయాడని అమెరికా సైనికాధికారి తెలిపారు.
నంగహార్ ప్రావిన్సులో ఐఎస్-కె గ్రూపునకు చెందిన ఒక ప్లానర్‌ను అమెరికా దళాలు ఈ ఆపరేషన్‌లో లక్ష్యంగా చేసుకున్నాయి.
కాబూల్ విమానాశ్రయం దగ్గర గురువారం దాడులు తామే చేశామని ఐఎస్-కె చెప్పింది. ఈ ఆత్మాహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు సహా మొత్తం 90 మంది మరణించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రోన్ దాడిలో ఐఎస్ మిలిటెంట్ ఒకడు చనిపోయినట్లు తెలిసిందని, ఇందులో పౌరులెవరూ చనిపోలేదని అమెరికా చెప్పింది.





