
433views
భారత్ లోని ఆస్పత్రుల్లో చేపట్టిన ఓ అధ్యయనానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కింది. ప్రపంచంలోనే శాస్త్రీయ సహకారం పొందిన అతిపెద్ద అధ్యయనంగా ఘనత పొందింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాలపై బ్రిటన్ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ఓ అంతర్జాతీయ అధ్యయనంలో భారత్ తో పాటు 116 దేశాల్లో లక్షా 40వేల మంది రోగులు పాల్గొన్నారు. సమీక్షకు ఉంచిన ఒక పేపర్ కు భారీ స్థాయిలో నిపుణులు తమ సహకారాన్ని అందించినందుకు ఈ ఘనత సంపాదించింది. ఈ అధ్యయనానికి ప్రపంచ వ్యాప్తంగా 15వేల మంది వైద్య నిపుణులు సహకారం అందించడం విశేషం.





