News

నెల్లూరు ఆయుర్వేద వైద్యం – వేలాదిగా తరలివస్తున్న జనం

580views

రోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుకు డిమాండ్‌ పెరుగుతోంది. నేటి నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఇంత వరకు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడికి వచ్చిన వారంతా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.