News

ఏప్రిల్ 26న సాయంత్రం 5 గంటలకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వీడియో సందేశం ప్రత్యక్ష ప్రసారం

1.7kviews

ర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ పరమపూజ్యనీయ డాక్టర్ మోహన్ భాగవత్ ఏప్రిల్ 26 న సాయంత్రం 5 గంటలకు “ప్రస్తుత పరిస్థితులలో మన పాత్ర” అనే అంశంపై ఆన్‌లైన్ లో ప్రసంగిస్తారు, ఇది యూట్యూబ్ మరియు ఫేస్‌బుక్‌ లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దానికంటే ముందు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జాతీయ పోరాటంలో చురుకుగా పాల్గొనవలసినదిగా సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి స్వయంసేవకులందరికీ విజ్ఞప్తి చేస్తారు.

అక్షయ తృతీయ శుభ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం నుండి ఆన్‌లైన్ ద్వారా పూజ్య సర్ సంఘచాలక్ ప్రసంగం వెలువడనుంది.

ప్రస్తుత పరిస్థితులు, జాతీయ స్పందన, భవిష్యత్ సవాళ్లు & అవకాశాలపై సర్ సంఘచాలక్ విస్తృతమైన వివరణ ఇస్తారు.

కరోనా మహమ్మారి నుండి ఏర్పడిన ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దేశం మొత్తం ఇప్పుడు మునిగిపోయిందని నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. పరిస్థితి భయంకరంగా ఉన్నప్పటికీ, దేశ నాయకత్వం మరియు మొత్తం సమాజం యొక్క ప్రతిస్పందన అద్భుతంగా ఉందని ఆర్ ఎస్ ఎస్ పేర్కొంది. దేశం యొక్క స్పందన యావత్ ప్రపంచానికీ మార్గదర్శిగా నిలచిందని, ఈ కృషిలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకులు కూడా గణనీయమైన పాత్రను పోషించారని సంఘ్ తెలిపింది.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భగవత్ నాగ్‌పూర్ నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఇది యూట్యూబ్ మరియు ఫేస్‌బుక్‌ లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులతో కలసి వీక్షించవలసిందిగా కోరుతూ ఆరెస్సెస్ అందరికీ ఆహ్వానం పలుకుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.