
13views
డెహ్రాడూన్ లోని ప్రతిష్ఠాత్మకమైన ‘‘లేఖక్ గావ్’’ గ్రామంలో 15 వ జాతీయ స్థాయి ‘‘యంగ్ థింకర్స్ మీట్’’ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ అరుణ్ కుమార్, ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్య కారిణి సదస్యులు రామ్ మాధవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ దేశవ్యాప్తంగా సమావేశమైన యువ మేధావుల సమక్షంలో, ‘RSS@100 – సంఘ్ చారిత్రక ప్రస్థానం’ అనే అంశంపై ఆయన ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. అలాగే గడచిన 100 ఏళ్లలో దేశ పునర్నిర్మాణం, సామాజిక సామరస్యం మరియు సాంస్కృతిక చైతన్య జాగరణ దిశగా సంఘ్ అందించిన చారిత్రక కృషిని, దాని సైద్ధాంతిక ప్రస్థానాన్ని వివరించారు.దేశమే ప్రథమం’ (Nation First) అనే స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
‘ఇండియా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతీయ సదస్సు పూర్తిగా యువత యొక్క మేధోపరమైన నాయకత్వానికి అంకితం చేయబడింది.భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపికైన యువ ఆలోచనాపరులు, పరిశోధకులు మరియు విశ్లేషకులు ఈ మూడు రోజుల మేధోమథన సదస్సులో పాల్గొంటున్నారు.
భారతదేశ సమకాలీన భౌగోళిక, రాజకీయ, సామాజిక-సాంస్కృతిక సమస్యలపై గంభీరమైన చర్చలు, గత శతాబ్దంలో సంఘ్ దేశవ్యాప్త ప్రభావం మరియు భవిష్యత్ భారతదేశంపై దార్శనికతపై చర్చ,వివిధ రాష్ట్రాల యువత మధ్య సాంస్కృతిక వినిమయం మరియు ఒక సైద్ధాంతిక నెట్వర్క్ ఏర్పాటుపై ఇందులో లోతుగా చర్చిస్తారు.





