News

లాక్ డౌన్ వేళ…..18 మంది ఉగ్రవాదులు హతం

857views

ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతున్న వేళా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలోనే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న గణంకాలే ఇందుకు నిదర్శనం. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 50 మంది ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు అర్పించారని, మరో 9 మంది సాధారణ పౌరులు సైతం మృతిచెందారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ ఏడాదిలో గడిచిన 4 నెలల్లో వివిధ ఘటనల్లో 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. మరణించిన వారిలో జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన టాప్‌ కమాండర్లు ఉన్నారని చెప్పారు. 9 మంది పౌరులు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారని చెప్పారు. 2019లో మొత్తం 160 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. 102 మంది అరెస్టయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.