News

ఐదేళ్ళలో 320మంది అవినీతి అధికారులను సాగనంపాం : స్పష్టం చేసిన కేంద్రం

716views

గడచిన ఐదు సంవత్సరాల్లో దేశంలోని దాదాపు 320మంది అవినీతి అధికారులకు ఉద్వాసన పలికామని కేంద్రం తాజాగా వెల్లడించింది. జులై 2014నుంచి ఫిబ్రవరి 2020 మధ్యకాలంలో దేశంలోని అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పదవీవిరమణ ఇచ్చామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఫండమెంటల్‌ రూల్‌ ఎఫ్‌ఆర్‌ 56(j)నియమాల ప్రకారం, 163మంది గ్రూప్‌ ‘ఏ’, 157మంది గ్రూప్‌ ‘బీ’ అధికారులపై ముందస్తు రిటైర్‌మెంట్‌ ప్రయోగించామని తెలిపారు. వీరిలో ముగ్గురు అఖిల భారత సర్వీసు(ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌)అధికారులు కూడా ఉండటం గమనార్హం. బుధవారం ఈ విషయమై కేంద్రమంత్రి లోక్‌సభలో వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.