NewsProgrammsSeva

జాతరలో సేవాభారతి ఆహార వితరణ

233views
శ్రీకాకుళం జిల్లా  పలాసలో యల్లమ్మ జామి జాతర సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో కార్యకర్తలు భక్తులకు మంచినీరు, పులిహోర వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ చురుగ్గా పాల్గొని తాము ఏర్పాటు చేసిన పదార్థాలను భక్తులకు ప్రేమగా అందించారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జాతరకు వచ్చిన తమకు సేవాభారతి కార్యకర్తలు గొప్ప సహాయాన్ని అందించినట్లయిందని, ఈ జాతర హడావుడిలో చక్కటి ఆహారాన్ని, దప్పిక తీర్చుకోవటానికి మంచి నీటిని ఏర్పాటు చేసిన సేవాభారతి కార్యకర్తల కృషి ప్రశంసనీయమని భక్తులు పేర్కొన్నారు.