News

అపరిచితుడి అకౌంటుకి డబ్బులు పంపాడు. పోలీసులు పట్టుకెళ్ళారు.

626views

ఫ్రెండు చెప్పాడనో ఇంకోటో, ఇంకోటో చూసుకోకుండా అపరిచిత వ్యక్తుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్థాపూర్‌ వాసి లింగన్నను జమ్ముకశ్మీర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహం కింద అరెస్టయిన వ్యక్తికి లింగన్న డబ్బులు పంపాడని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో ఉంటున్న స్నేహితుడి సూచన మేరకు నగదు పంపినట్లు వివరించారు. రూ.5వేల నగదును గూగుల్‌ పే యాప్‌ ద్వారా రాకేశ్‌ అనే వ్యక్తికి బదిలీ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు లింగన్నను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన ఘటనపై రాకేశ్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతని బ్యాంక్‌ అకౌంట్లు పరిశీలిస్తున్న క్రమంలో కుస్థాపూర్‌ వాసి లింగన్న అతడికి డబ్బులు జమ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఇక్కడికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.