
1.1kviews
పాకిస్థాన్ లో మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి హై కమిషనర్ మిషెల్లే బాష్ లెట్ ఆరోపించారు. మైనారిటీల ప్రార్థనా మందిరాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దైవదూషణ నిరోధక చట్టంలోని నిబంధనల పేరుతో వారిపై హింసకు పాల్పడుతున్నారన్నారు. గురువారం జెనీవాలో జరిగిన హక్కుల మండలి 43వ సదస్సులో ఆమె మాట్లాడుతూ దైవదూషణ నిరోధక చట్టంలో మార్పులు చేయాలని పలు అంతర్జాతీయ సంస్థలు సూచించినా పాక్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.





