
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో షాహీన్‌బాగ్ నిరసనకారులకు సంఘీభావంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు షాహీన్‌బాగ్ నైట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఆ కార్యక్రమం నిర్వహించిన ముగ్గురు విద్యార్థులపై యూనివర్శిటీ పాలనా విభాగం ఒక్కొక్కరికీ రూ.5వేలు జరిమానా విధించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

జనవరిలో జరిగిన షాహీన్‌బాగ్ నైట్ కార్యక్రమానికి రాత్రి 9 తర్వాత అనుమతి లేదని పాలనా విభాగం చెబుతోంది. అయినప్పటికీ జరిమానా విధించబడ్డ ముగ్గురు విద్యార్థులు కార్యక్రమాన్ని పొడిగించారని చెబుతోంది. అంతేకాదు యూనివర్శిటీ క్యాంపస్ గోడలపై రంగులతో పెయింటింగ్‌లు కూడా వేశారని పాలనా విభాగం పేర్కొంది. యూనివర్శిటీ యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించినందుకు ముగ్గురు విద్యార్థులు ఫసీ అహ్మద్, సహానా ప్రదీప్ మరియు అదీష్‌లపై ఒక్కొక్కరికీ రూ.5వేలు జరిమానా విధించినట్లు అడ్మిన్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. నోటీసులు ఇచ్చిన 10 రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని చెబుతూ మంగళవారం నోటీసులు జారీ చేయడం జరిగింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





