News

ఎనిమిది మంది మావోలు హతం

716views

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.ఈ ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆపరేషన్‌ ప్రహార్‌లో భాగంగా పోలీసులు, మావోయిస్టులు మధ్య తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్‌ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు దాదాపు 30 గంటల పాటు ఆపరేషన్‌ ప్రహార్‌ను చేపట్టాయి. ఘటనా స్థలంలో మావోయిస్టుల నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.