
నంద్యాల పట్టణంలో సక్షమ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దివ్యాంగుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 300 మంది దివ్యాంగులు మరియు వారి తల్లిదండ్రులు అలాగే దివ్యాంగుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థలు NGO’S పాల్గొన్నాయి.
ప్రారంభం లో శ్రీ వివేకానంద ఆడిటోరియం నుండి శ్రీనివాస సెంటర్ వరకు ర్యాలీ జరిగింది శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమనికి సక్షమ్ నగర అధ్యక్షులు శ్రీ డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సభలో సేవా భారతి రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ మనోహర్ సక్షమ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. సేవాభారతి రాష్ట్ర కార్యదర్శి శ్రీకాకాణి పృథ్విరాజు RPD ACT గురించి దానిలోని అంశాల గురించి వివరించారు. అలాగే శ్రీ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ సక్షమ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సభా ముఖంగా తెలియజేశారు.

ఆర్ఎస్ఎస్ కర్నూలు విభాగ్ సంఘచాలక్ డాక్టర్ ఉదయ శంకర్ మాట్లాడుతూ సంత్ రవిదాసును ఉదాహరణగా వివరిస్తూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమలో ఉన్న ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటూ విద్యా, ఉపాధి రంగాలలో అవకాశాలు సాధించి రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ AD శ్రీమతి భార్గవి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో దివ్యాంగులకు అనువుగా ఉండుటకు రాంపులను ఏర్పాటు చేయాలని కోరారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మురళికృష్ణ గారు , భారత వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పబ్బు బాల చంద్రుడు గారు, పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సేవా సంస్థలు (NGOS) , దివ్యాంగుల ఉన్నతి కోసం పాటు పడుతున్న తల్లిదండ్రులను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా సహా కార్యదర్శి బండారు సుబ్బారావు, నగర జిల్లా కోశాధికారి శ్రీ గాజుల హరిబాబు, శ్రీ పాములేటి, శ్రీ అంజిబాబు, శ్రీ వీర భద్రుడు, శ్రీ అప్పయ్య, శ్రీ రమణయ్య, శ్రీ రంగ స్వామి కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. పలువురు సేవా తత్పరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





