CAA, NRC అంటే ఏంటో తెలియకుండానే నిరసనలు – మీడియాకు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెప్పిన నిరసనకారులు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితాలకు (ఎన్‌ఆర్‌సీ) వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయితే ఇందులో పాల్గొంటున్న వారికి సరయిన అవగాహన ఉందా అనేది ప్రశ్నార్థకమే. వారిలో చాలామందికి అవి ఏమిటో, ఎందుకో తెలియదని చెప్పే ఒక సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. CAA కి వ్యతిరేకంగా బిహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ‘బిహార్ బంద్’కు పిలుపునిచ్చింది. దీనిలో పెద్దవారితో పాటు చాలామంది చిన్నపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనటం కనిపించింది. కానీ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అంశాలను గురించి వారిని ప్రశ్నించినపుడు వారు అతి విచిత్రమైన సమాధానాలిచ్చారు.
”మహాత్మాగాంధీ హత్యకు వ్యతిరేకంగా మేము ప్రదర్శన చేస్తున్నాము. అతన్ని గాడ్సే చంపేశాడు. ప్రభుత్వం మహాత్మా గాంధీని చంపిన వారికి సహాయం చేస్తోంది.” అని ఒకరు చెప్పారు. మరో సమూహంలోని వారు లాలూ ప్రసాద్ యాదవ్‌ను విడిపించటానికి, ఆర్జేడీ ప్రభుత్వం రాష్ట్రంలో రావటానికని చెప్పారు. ”బిహార్‌లో మహిళలపై అత్యాచారాలు అధికమౌతున్నాయి. ఆడవారిపై అత్యాచారం చేసి, వారిని తగలపెట్టటానికి నిరసనగా మేము ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాం.” అని ఒక స్థానిక ఆర్జేడీ నేత అన్నాడు. ఈ అన్నిటి కంటే అత్యద్భుతమైన కారణం …”సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అనేది ఒక యంత్రం. ఇటువంటి యంత్రాలు భారత పౌరులను ఉత్పత్తి చేస్తాయి. వారికి పౌరసత్వాన్నిస్తాయి.” అని సమాధానాలు చెప్పడం విశేషం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.