
పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని రాజకీయ పక్షాలు, కొన్ని సంస్థలు వదంతులు వ్యాపింపజేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ చట్టాన్ని పశ్చిమబెంగాల్ లో అమలు చేయబోమంటూ యాడ్స్ కూడా ఇస్తోంది. ఈ నేపథ్యంలో, వెంటనే ఈ యాడ్స్ ను ఆపేయాలంటూ కోల్ కతా హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అలాగే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనకు ఉంచిన బోర్డులు వగైరాలను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గతంలోనే ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ సంచలన వ్యాఖ్యలు చేసి ఉన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. ఆమె చేస్తున్నది నేరపూరిత చర్య అని గవర్నర్ అన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని ఆయన అన్నారు. పార్లమెంటు ఓ అంశంపై చట్టం చేశాక దానికి వ్యతిరేకంగా ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని జగదీప్ ధన్‌ఖర్ చెప్పుకొచ్చారు. పార్లమెంటు చట్టాన్ని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. మీరు రాజ్యాంగానికి బద్దులై పనిచేస్తూ శాంతిని కాపాడాలని కోరుతున్నానని ఆయన అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం ప్రసారమాధ్యమాల్లో ప్రకటనలు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ అనుకూల ప్రకటనల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, తక్షణం దీన్ని ఆపాలని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





