News

అమెరికన్ నేవీ షిప్‌యార్డ్‌లో ఆగంతకుడి కాల్పులు

349views

మెరికాలోని హవాయిలో గల పెరెల్‌ హార్బర్‌ నేవీ షిప్‌యార్డ్‌లో ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేవీ బేస్‌లోకి చొరబడిన ఓ ఆగంతకుడు అక్కడి సిబ్బందిపై కాల్పులతో విరుచుకుపడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో డిఫెన్స్‌ సివిలియన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని యూఎస్‌ నేవీలో పనిచేస్తున్న నావికుడిగా గుర్తించారు.

భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ మార్షల్‌ రాకేశ్ కుమార్‌ సింగ్‌ భదౌరియా

ఇదే షిప్‌యార్డ్‌లోనే ఎయిర్‌బేస్‌ కూడా ఉంది. అక్కడ పసిఫిక్ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్స్‌ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో భారత్‌ నుంచి చీఫ్‌ మార్షల్‌ భదౌరియా సహా వాయుసేన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో వీరంతా అక్కడే ఉన్నారు. అయితే ప్రమాదంలో వీరికి ఎలాంటి హానీ జరగలేదని ఐఏఎఫ్‌ తెలిపింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.