NewsProgramms

ఆద్యంతాలు లేనిదే సనాతన ధర్మం – శ్రీ శ్యాం కుమార్

1.2kviews

ర్నూలు జిల్లా నంద్యాల త్రినేత్ర హోటల్లోని అట్లా ఫంక్షన్ హాల్ లో స్వయం సేవకులు, వారి కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

మాననీయ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ ఉదయ శంకర్, నంద్యాల కార్యవాహ శ్రీ చిలుకూరు శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది శ్రీ నీలకంఠేశ్వరయ్య, క్షేత్ర ప్రచారక్  శ్రీ శ్యామ్ జీ తదితరులు పాల్గొని మార్గదర్శనం చేశారు.

కార్యక్రమం చిన్నారి సాంస్కృతిక నృత్యంతో మొదలైంది. తదుపరి వారి కుటుంబాలలో సంఘ సంపర్కం వల్ల వచ్చిన మార్పును తెలియజేయవలసిందిగా శ్యామ్ జీ కుటుంబ సభ్యులను కోరారు. స్వయంసేవకులు, గృహిణులు ఎంతో ఉత్సాహంగా వారి వారి కుటుంబాలలో సంఘ సంపర్కం వల్ల వచ్చిన మార్పులను వివరించారు. మల్లిఖార్జున గారు తన కుమార్తెలు మతం మారిన వారిని ఎలా తిరిగి మన మతంలోకి తీసుకు వచ్చారో, మత ప్రచారాన్ని ఎలా అడ్డుకున్నారో,  తమ కుటుంబంతో ముస్లిం కుటుంబాన్ని ఎలా కలుపుకున్నారో వివరించారు.

శ్రీమతి ఉమాదేవి గారు మాట్లాడుతూ తమ కుమార్తె ఫ్రాన్స్ లో ఉన్నా హైందవ సంప్రదాయాన్ని ఎలా పాటిస్తున్నారో, మెట్టినింట ఎలాంటి మార్పులు తీసుకువచ్చారో తెలియజేశారు.  శ్రీ మేడా మురళీధర్, డా. శ్రీకాంత్ రెడ్డి, శ్రీ నిమ్మకాయల సుధాకర్, శ్రీ వై యన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు.

శ్యామ్ జీ మాట్లాడుతూ గ్రీక్, రోమన్ లాంటి గొప్ప గొప్ప నాగరికతలు కాలగర్భంలో కలిసిపోతే సనాతన ధర్మం మాత్రం సజీవంగా వున్నదని, సనాతనం అంటేనే ఆది, అంతం లేనిదని వివరించారు. ఈ ధర్మం చిరంతనంగా సాగిపోతూ ఉండడానికి కారణం భారతీయ కుటుంబ వ్యవస్థే కారణమని చెప్పారు. సనాతన ధర్మంలో మహిళలకు అత్యున్నత స్థానం ఇవ్వబడిందని తెలిపారు. గృహిణులు సంఘ కార్య శైలి గురించి అవగాహన చేసుకున్నప్పుడే సంఘ కార్యం సజావుగా జరుగుతుందని తెలియజేశారు. ఒక మగవాడు సంస్కారం పొందితే అది అతనికే పరిమిత మవుతుందని, ఒక మహిళ సంస్కారం పొందితే దానివల్ల ఒక కుటుంబం సంస్కారవంతమౌతుందని తెలిపారు.

హిందూ ధర్మాన్ని విస్మరిస్తే భారత దేశం తన ఉనికినే కోల్పోతుందని శ్యాంజీ పేర్కొన్నారు. పాకిస్థాన్ హిందుత్వాన్ని కోల్పోయిన కారణంగానే వినాశనం అంచున ఉన్నదని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహ కలిగి ప్లాస్టిక్ మరియు విష రసాయనాల వాడకం తగ్గించి భూమాత కష్టాలు నివారించాలని కోరారు. భోజన కార్యక్రమం తో సమావేశం ముగిసింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.