
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఉద్యోగాల్లో అధిక శాతం చిత్తూరు వాసులకే ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకూ ఉండే అన్ని ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించింది టీటీడీ పాలకమండలి.
టీటీడీ బోర్డు సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితునిగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చారు. ఆయన ఈ ప్రతిపాదనలు చేశారు.. దీన్ని పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తీర్మానానికి ఆమోదం పలికితే టీటీడీ ఉద్యోగాల నోటిఫికేషన్ లలో చిత్తూరు జిల్లా యువతీ యువకులకు ప్రాముఖ్యం పెరగనుంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





