
అయోధ్య వివాదానికి సంబంధించి సుదీర్ఘ విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్న వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం “నేను ఈ తీర్పుతో సంతృప్తిగా లేను. మాకు రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉంది. మేం మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. మాకు మీరు భిక్షగా ఇచ్చే ఐదెకరాల భూమి అవసరం లేదు”. అని వ్యాఖ్యానించారు.
దీంతో అసదుద్దీన్ అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని పేర్కొంటూ పవన్ కుమార్ యాదవ్ అనే న్యాయవాది మధ్యప్రదేశ్లోని జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





