News

ప్రాచీన విద్యా వ్యవస్థ వైభవోపేతం : కృష్ణ గోపాల్

10views
ప్రాచీన భారత్‌లో విద్య పూర్తిగా ఉచితంగా లభించేదని, గురుకులాల్లో విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ఆహారం, దుస్తులు, మందులు మరియు పుస్తకాలు అందేవని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ డాక్టర్ కృష్ణగోపాల్ అన్నారు. భారత దేశంలో సంపన్నమైన విద్య వ్యవస్థ వుండేదని, వైభవోపేతమైన ప్రాచీన విద్యా వ్యవస్థ నడిచేదన్నారు.
లక్నోలోని మాలవీయ ఆడిటోరియంలో మహా మనా శిక్షణ్ సంస్థాన్ నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవంలో డాక్టర్ కృష్ణ గోపాల్ మాట్లాడారు. జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యపై ఫీజులను విధించి, దానిని వ్యాపారాత్మకంగా మార్చింది బ్రిటీష్ వారేనని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత విద్యావ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎక్స్‌ప్రెస్‌వేలు, రహదారులు, విమానాశ్రయాలు నిర్మించబడుతున్నప్పటికీ, సమాజంలోని దాదాపు 80 శాతం మంది ఉన్నత విద్యను అభ్యసించే ఆర్థిక సామర్థ్యాన్ని ఇంకా కలిగి లేరని అన్నారు. విద్య ఈ విధంగా ఖరీదైనదిగా మారడం వల్ల సమాజంలో అసంతృప్తి పెరుగుతోందని చెప్పారు.
ప్రపంచ వేదికపై భారత్ అందించిన చారిత్రక, శాస్త్రీయ సహకారాన్ని కూడా సహ సర్ కార్యవాహ్ ఉద్ఘాటిస్తూ, ప్రాచీన కాలంలో దేశం ఆర్థిక, భౌతిక పురోగతిలో అత్యున్నత శిఖరానికి చేరుకుందని అన్నారు.
ప్రాచీన భారత్‌లోని ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉండేదని ఆయన పేర్కొన్నారు. నలంద, తక్షశిల, విక్రమశిల వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో ఉండేవి, అక్కడ చదువుకోవడానికి విదేశాల నుండి విద్యార్థులు వచ్చేవారు. అయితే, మొదట ఇస్లామిక్ దండయాత్రలు ఈ గొప్ప విద్యాసంస్థలను నాశనం చేశాయని, ఆ తర్వాత బ్రిటీష్ వారు భారత్ యొక్క సాంప్రదాయ విద్యావ్యవస్థను పూర్తిగా నిషేధించారని తెలిపారు. ఈ అణచివేత విధానం వల్లనే ఒకప్పుడు ఎంతో సమృద్ధిగా ఉన్న భారత్ క్రమంగా నిరక్షరాస్యత కలిగిన దేశంగా మారిందని అన్నారు.