
వక్ఫ్ అంటే ఏమిటీ?
వక్ఫ్ అంటే ముస్లిం వ్యక్తి లేదా సమాజం తమ భూమిని అల్లాకి ఇవ్వడం! ఒక సారి అల్లా కి ఇచ్చిన తరువాత తిరిగి వెనక్కి తీసుకోవడం కుదరదు. అది అల్లా కే చెందుతుంది! వక్ఫ్ అంటే స్థిర, చర ఆస్తులని ముస్లిం మతపరమైన కార్యకలాపాలకి మరియు దాన ధర్మాలకి ఉపయోగించే నిమిత్తం రూపొందించబడిన ఇస్లామ్ చట్టం. ఒక సారి భూమి అల్లాకి ఇచ్చిన తరువాత ఆ భూమిని అమ్మడం లేదా ఇతరులకి బదలాయించడం కుదరదు, అది అల్లా ఆస్తి!
వకీఫ్ (Wakif )అంటే వక్ఫ్ ఆస్తులని స్వాధీనం చేసుకోవడానికి నియమించబడతాడు. వకీఫ్ వక్ఫ్ ఆస్తులని నిర్వహించడానికి ముతావలి ( Mutawalli) ని నియమిస్తాడు. ముతావలి వక్ఫ్ ఆస్తులని అల్లా తరుపున మేనేజ్ చేస్తాడు!
ఈ వక్ఫ్ కి మూలాలు ఎక్కడ ఉన్నాయి?
మిగతా ముస్లిం దేశాలని పక్కన పెడితే భారత దేశంలో వక్ఫ్ మూలాలు మాత్రం ఢిల్లీ సుల్తానుల కాలంలో కనపడుతుంది. అప్పటి ఢిల్లీ సుల్తాను మౌజీద్దీన్ సామ్ ఘోర్ ( Muizuddin Sam Ghaor ) ముల్తాన్ ( ప్రస్తుత పాకిస్తాన్ నగరం) లోని జామా మసీదుకి రెండు గ్రామాలని ఇచ్చాడు ( వక్ఫ్). ఆ వక్ఫ్ కి అంటే రెండు గ్రామాలకి షైఖుల్ ఇస్లామ్ ని సంరక్షడిగా నియమించాడు! తరువాత కాలంలో ముస్లిం పాలకులు వక్ఫ్ ఆస్తులని పెంచుకుంటూ పోయారు!
వక్ఫ్ ని రద్దు చేయడానికి ప్రయత్నాలు జరిగాయా?
19 వ శాతాబ్దపు చివరలో బ్రిటీష్ పాలనలో వక్ఫ్ వివాదం లండన్ లోని న్యాయస్థానం దృష్టికి వెళ్ళినప్పుడు నలుగురు బ్రిటీష్ జడ్జి లు కేసు విచారించి ఇలా వ్యాఖ్యానిస్తూ వక్ఫ్ ని రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. “a perpetuity of the worst and the most pernicious kind” and declared Waqf to be invalid. అంటే వక్ఫ్ చట్టం అనేది హెయమైనది కాబట్టి చెల్లదు అని.కానీ లండన్ కౌన్సిల్ లోని నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుని భారత్ లో ఎవరూ లెక్క చేయకపోగా మరింత చట్టబద్ధం చేశారు.1913 లో ముసల్మాన్ వక్ఫ్ కి చట్టభద్ధత కల్పిస్తూ వక్ఫ్ చట్టంని చేశారు, దానినే 1913 వక్ఫ్ యాక్ట్ అంటున్నారు. 1913 తరువాత వక్ఫ్ ని రద్దు చేయడానికి ఇంతవరకు ప్రయత్నం చేయలేదు.
1913 తరువాత వక్ఫ్ యాక్ట్ కి కీలకమైన మార్పులు, చేర్పులు ఎప్పుడు జరిగాయి?
వక్ఫ్ యాక్ట్ 1954!
1995 వక్ఫ్ యాక్ట్!
1995 లో ప్రవేశపెట్టిన వక్ఫ్ యాక్ట్ బిల్లులో చాలా వివాదాస్పద అంశాలని చేర్చి దోపిడీ కి తెర లేపారు!
1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ ని ఉపయోగించి చేసిన 1995 వక్ఫ్ యాక్ట్ లో అవకతవకలకి అంతే లేకుండా పోయింది!
1995 వక్ఫ్ యాక్ట్ బిల్లు అనేది భారత దేశంలో ఉన్న శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకి సమాంతరంగా వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి అధికారాలు కట్టపెట్టారు!
1.దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలలో ఉన్న వక్ఫ్ బోర్డుల మీద సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కి పూర్తి అధికారాలు ఉంటాయి.
2. ఒక సారి ఎవరి ఆస్తిని అన్నా వక్ఫ్ ఆస్తి అంటే అది వక్ఫ్ బోర్డు స్వంతమవుతుంది.
3.వక్ఫ్ ఆస్థుల విషయంలో ఏదన్నా వివాదం తలెత్తితే వక్ఫ్ ట్రిబ్యునల్ లో పరిష్కరించుకోవాలి తప్పితే సివిల్ కోర్టులో కేసు వేయడానికి వీలు లేదు. అసలు సివిల్ కోర్టుల పరిధిలోకి వక్ఫ్ ఆస్తుల వివాదం రాకుండా చట్టం చేశారు.
4.వక్ఫ్ ట్రిబ్యునల్ లో అందరూ ముస్లిమ్స్ ఉంటారు.
5.వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఫైనల్! కేవలం హై కోర్టులోనే అప్పీల్ చేసుకోవాలి తప్పితే జిల్లా కోర్టులలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు లేదు. ఎంత మందికి హై కోర్టులో వేసేంత స్థోమత ఉంటుంది?
6. షియా, సున్నీ లకి వేరు వేరు వక్ఫ్ బోర్డులని ఏర్పాటు చేశారు.
2013 లో మళ్ళీ వక్ఫ్ బిల్లుకి సవరణలు చేశారు. ఈ సారి కొన్ని సెక్షనలలో మార్పులు చేశారు.
1995 వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి 2013 లో ప్రవేశ పెట్టిన వక్ఫ్ బిల్లు ఘోరమైన నేరాలకి అవకాశాలని కారణం అయ్యింది.
2013 వక్ఫ్ సవరణ బిల్లు ముఖ్యంగా ఒక వివాదానికి దారి తీసింది అది: ఏమతం వారైనా వక్ఫ్ కి తమ ఆస్తి ని ఇవ్వవచ్చు. నిజానికి ఇస్లామ్ కి చెందిన వారు మాత్రమే వక్ఫ్ కి తమ ఆస్థి ఇవ్వాలి. కానీ ఈ బిల్లులో ఏ మతానికి చెందినది అయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించవచ్చు.
వక్ఫ్ స్వాదీనంలోకి తీసుకున్న ఆస్థులు తిరిగి తీసుకోవచ్చా?
లేదు. ఒక సారి వక్ఫ్ అధీనం లోకి వెళ్ళిపోయి అల్లా పేరిట రిజిస్టర్ అయిన ఆస్థిని వెనక్కి తీసుకోలేరు!
ఉదాహరణ: బెంగుళూరు ఈద్గా మైదానం 1850 లో వక్ఫ్ గా ప్రకటించారు. ఇప్పటికి వక్ఫ్ అదీనంలోనే ఉంది కానీ రెవెన్యూ రికార్డ్స్ లో అది ప్రభుత్వ భూమిగానే ఉంది. సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ వక్ఫ్ అని గుజరాత్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది కానీ సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ వక్ఫ్ ట్రిబ్యునల్ లో కేసు వేసి గెలిచింది. ఈ విషయంలో ఎవరైతే ఆ బిల్డింగ్ కి హక్కు దారు అని ప్రకటించుకున్నాడో ఆ వ్యక్తి తగిన ఆధారాలు చూపలేకపోయాడు. ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి తప్పుడు డాక్యుమెంట్ల తో వక్ఫ్ అని ప్రకటించినవి.
అన్ని ఇస్లామిక్ దేశాలలో వక్ఫ్ ఉన్నదా?
అన్ని ఇస్లామిక్ దేశాలలో వక్ఫ్ అనేది లేదు. టర్కీ, లిబియా, ఈజీప్ట్, సూడాన్, సిరియా, లెబనాన్, జోర్దాన్, ట్యూనీషియా, ఇరాక్ దేశాలలో వక్ఫ్ లేదు.జోర్దాన్ రాజు మొహమ్మద్ ప్రవక్త వారసుడు కానీ జోర్దాన్ లో వక్ఫ్ లేదు.కానీ మన దేశంలో మాత్రం వక్ఫ్ కి చట్ట బద్ధత కల్పించారు.
వక్ఫ్ కింద ఎన్ని ఆస్థులు ఉన్నాయి?
వక్ఫ్ అధీనంలో 8 లక్షల 70 వేల టైటిల్స్ ఉన్నాయి. 9 లక్షల 40 వేల ఎకరాలు భూమి ఉంది. మన దేశంలో సైన్యం, రైల్వే ల తరువాత ఎక్కువ భూమి ఉంది వక్ఫ్ దగ్గర! వీటి విలువ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు.
వక్ఫ్ బోర్డు వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి?
చాలా సమస్యలు ఎదురయ్యాయి మరియు అవి కొనసాగుతూనే ఉన్నాయి.వక్ఫ్ బోర్డు కి ఇచ్చిన అధికారాలు దుర్వినియోగం చేశారు, చేస్తూనే ఉన్నారు.ముత్తావలి లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రికార్డులు మైంటైన్ చెయ్యట్లేదు. ఏది వక్ఫ్ గా ప్రకటించారో దానిని రిజిస్టర్ చేసి రెవెన్యూ విభాగానికి తెలియచేయాలి కానీ అలా జరగట్లేదు. వక్ఫ్ గా ప్రకటించిన ఆస్థిని ముత్తావలి బోర్డులో రిజిస్టర్ చేయకుండా, రెవెన్యూ విభాగానికి తెలియచేయకుండా అక్రమాలకి పాల్పడడం తో భూ యజమానులు తమ ఆస్తులని అమ్ముకోవడానికి వీలులేకుండా పోతున్నది. రెవెన్యూ రికార్డులలో క్లియర్ టైటిల్ ఉంటుంది కానీ అది వక్ఫ్ అధీనంలో ఉన్నట్లు రెవెన్యూ విభాగానికి తెలియదు.
వక్ఫ్ బోర్డులో రిజస్టర్ చేయకుండా ఉన్నవాటిని లీజుకి ఇవ్వడమో లేదా అమ్ముకోవడమో చేస్తున్నారు.
వక్ఫ్ గా ప్రకటించబడ్డ భూమి తాలూకు సర్వే చేయకుండా ముత్తా వలి లు జాప్యం చేస్తున్నారు ఉద్దేశ్యపూర్వకంగా.
Once a Wakf always a wakf అనేది పెద్ద సమస్య!
సర్వే!
గుజరాత్, ఉత్తరాఖండ్ లలో వక్ఫ్ భూములుగా ప్రకటించబడ్డవి ఇంతవరకు సర్వే చేయలేదు.
2014 లో ఉత్తర ప్రదేశ్ లో వక్ఫ్ కి సంబంధించి సర్వే చేయమని అడిగినా ఇంతవరకు సర్వే చేయకపో వడం వలన ఏది వక్ఫ్ భూమో, ఏది ప్రభుత్వ భూమో తెలియడం లేదు.
వక్ఫ్ బోర్డు తరుపున సర్వే చేయడానికి అనుభవం ఉన్న సర్వే కమీషనర్లు దొరకడం లేదని కుంటి సాకు చెపుతున్నారు.
సెక్షన్ 40 వక్ఫ్ యాక్ట్ అపరిమితమైన అధికారాలు ఇస్తున్నది. సెక్షన్ 40 వల్ల వాళ్లకి ఇష్టమైన ఆస్థిని వక్ఫ్ గా ప్రకటించడం పెద్ద సమస్యగా మారింది.
రాజ్యాంగ బద్ధత ఉందా?
అసలు వక్ఫ్ చట్టానికి రాజ్యాంగ బద్ధత లేదు! కేవలం ముస్లిమ్స్ కి మాత్రమే వర్తించే వక్ఫ్ యాక్ట్ ఉంది కానీ వేరే ఏ మతానికి లేదు. దీని మీద ఢిల్లీ హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఢిల్లీ హైకోర్టు ప్రతిస్పందన తెలియచేయమని నోటీసులు ఇచ్చి చాలా రోజులు అయ్యింది!
వక్ఫ్ బోర్డులమీద కేంద్ర మైనారిటి మంత్రిత్వ శాఖకి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి?
వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 40 ఏమి చెపుతున్నది అంటే ఏదన్నా ఆస్థి వక్ఫ్ అనిపిస్తే ఆ ఆస్థిని వక్ఫ్ గా ప్రకటించవచ్చు. దీని వల్ల చాలా ఫిర్యాదులు వచ్చాయి కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖకి. సెక్షన్ 40 ని దుర్వినియోగం చేయడం వల్లనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.గత 2023 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 148 ఫిర్యాదులు వచ్చాయి సెక్షన్ 40 ని దుర్వినియోగం చేయడం వల్ల. వీటిలో అన్ని ఫిర్యాదులు కూడా తమ భూములని ఆక్రమించుకుని అమ్మేసుకున్నారు అని.ఇంకా ఎక్కువే ఉండవచ్చు ఎందుకంటే కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేయవచ్చు అని చాలా మంది బాధితులకి తెలియదు.
మరో 556 ఫిర్యాదులు తమ భూములని వక్ఫ్ కి ఇస్తే బోర్డులో రిజిస్టర్ చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కుమ్ముక్కు అయి అమ్మేసుకున్నారు అని. నిజానికి 556 ఫిర్యాదు దారులు ముస్లిమ్స్ మరియు తమ భూములని వక్ఫ్ కి ఇష్టపూర్వకంగా ఇచ్చారు.మరో 93 ఫిర్యాదులు వక్ఫ్ బోర్డు అధికారులు ముత్తావలి ల మీద ఇచ్చారు.
వక్ఫ్ బోర్డుల వద్ద ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి?
మొత్తం 40,951 కేసులు వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో 9,942 కేసులు ముస్లిమ్స్ కి సంబంధిచినవి ఉన్నాయి!
విచిత్రం ఏమిటంటే విలువైన ముస్లిమ్స్ భూములని కూడా అవి వక్ఫ్ భూములని డిక్లేర్ చేశారు. 9,942 కేసులలో అత్యధిక శాతం ముస్లిమ్స్ భూములని అక్రమంగా ఆక్రమించిన వాటికి సంబంధినవే!
వక్ఫ్ కి సంబంధించి సవరణ చేయకముందు ఉన్న సమస్యలు:
తిరుచేందురాయ్ గ్రామం- Thiruchendurai Village
శ్రీరాంగం తాలూకా,తిరుచురాపల్లి జిల్లా. ఈ గ్రామం మొత్తాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించి ఈ గ్రామంలో ఎవరూ ఆస్తులని అమ్మడం కానీ కొనడం కానీ చేయకుండా జీరో వాల్యూ చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కోరింది తమిళనాడు వక్ఫ్ బోర్డు.అయితే గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మీద స్టే విధించింది.
బెట్ ద్వారక దగ్గర దీవులని వక్ఫ్ గా ప్రకటించింది! అక్కడితో ఆగకుండా గుజరాత్ హై కోర్టుకి ఒక అప్లికేషన్ ఇచ్చింది, ఆ అప్లికేషన్లో బేట్ ద్వారకా లోఉన్న రెండు దీవులు వక్ఫ్ ఆస్తులుగా పరిగణి స్తున్నామని కాబట్టి మా అప్లికేషన్ ని పరిశీలించండి అని.గుజరాత్ హై కోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దేవ భూమి అయిన ద్వారక ని వక్ఫ్ ఆస్తిగా ఎలా పరిగణిస్తారు అంటూ అప్లికేషన్ ని విచారించడానికి తిరస్కరించాడు.
శివశక్తి సొసైటీ, సూరత్, గుజరాత్.
గుజరాత్ లోని సూరత్ నగరంలో శివశక్తి హోసింగ్ సొసైటీ లో ఒక ఖాళీ ప్లాట్ కొన్న ముస్లిం వ్యక్తి ఒకరు తన ప్లాట్ ని వక్ఫ్ కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంటే మొత్తం శివశక్తి హోసింగ్ సొసైటీ వక్ఫ్ ఆస్తిగా పరిగణనించ చబడుతుంది మిగతా ప్లాట్ యజమానులకి తెలియకుండా. అఫ్కోర్స్ ఆ ప్లాట్ లో మసీదు కట్టడానికి సన్నాహాలు చేయగా కోర్టు జోక్యంతో ఆగిపోయింది!
Contd.. Part 2
జైహింద్!





