News

రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్‌ రాజ్‌పై పరువు నష్టం దావా

3views

నటుడు ప్రకాశ్ రాజ్‌పై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నటుడు ప్రకాశ్ రాజ్‌పై రూ.100 కోట్లకు దావా వేశారు. భాను ప్రకాశ్ తరఫు న్యాయవాది.. ప్రకాశ్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని భాను ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో రామ లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రామలక్ష్మణులు ఉత్తరభారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలు అంటూ వ్యాఖ్యానించారు. ఉత్తరభారతదేశానికి చెందిన రామలక్ష్మణులు.. దక్షిణాదికి చెందిన రావణుడి పొలంలో పండ్లను దొంగతనం చేశారని అన్నారు. అయితే రామలక్ష్మణులను వలస కూలీలు అంటూ ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.