
5views
మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని అప్పయ్యరాజుపేట గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా, పుల్లంపేట మండలం లోని పెరియవరం గ్రామానికి చెందిన ఎద్దల మల్లికార్జున అనే వ్యక్తి అందరూ చూస్తుండగానే గ్రామంలో ప్రతిష్టించిన గ్రామదేవత గంగమ్మ రాతి విగ్రహాన్ని బండరాయితో పగలగొట్టారు. ఎందుకిలా చేశావని గ్రామస్తులు ప్రశ్నించగా భాకరపేట, పుల్లంపేట చర్చి పాస్టర్లు హిందూ దేవతా విగ్రహాలను పూజిస్తే నరకానికి పోతారు, హిందూ విగ్రహాలను ధ్వంసం చేస్తే ప్రభువు దగ్గరకు చేరుకుంటారని తెలపడంతో గంగమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపాడని గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిత్యం హిందూ దేవతలను దూషిస్తూ కేకలు వేస్తుంటాడని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు.





