News

గురి తప్పిన ఉగ్రదాడి

51views

రోజు షుమారు 11 గం సమయంలో జమ్మూకాశ్మీర్లోని అనంత నాగ్ పట్టణంలో డిప్యూటీ కమిషనర్ ఆఫీసు వద్ద జరిగిన బాంబు దాడి లో 10మంది గాయపడ్డారు. అందుతున్న సమాచారం ప్రకారం అత్యంత కట్టు దట్టమైన భద్రత నడుమ ఉండే ఈ కాంప్లెక్స్ పై టెర్రరిస్టులు దాడి చేశారు. అయితే టెర్రరిస్టుల లక్ష్యం గురి తప్పి బాంబ్ రోడ్డుపై పడటం తో ఒక 12సంవత్సరాల బాలిక, ఒక జర్నలిస్ట్, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే అనంత నాగ్ లోని ఒక హాస్పిటల్కు తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలియ వచ్చింది.
సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంత వరకు ఏ టెర్రరిస్ట్ సంస్థ ఇందుకు బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత సెప్టెంబర్28 న CRPF జవాన్ల పై శ్రీనగర్ లో దాడి జరిగింది. అయితే ఆ దాడి కూడా గురి తప్పింది.
ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత కేంద్రం జమ్మూకాశ్మీర్ తో సహా 7రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే జమ్మూకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సలహాదారు డైన ఫరూక్ ఖాన్ మాత్రం రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకుంటున్నాయని ఇంతకు ముందు వేల సంఖ్యలో ఉన్న టెర్రరిస్ట్ లు ప్రస్తుతం150 నుండి200 వరకూ మాత్రమే ఉన్నారని, త్వరలోనే సాదారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.
మరోవైపు ఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులకు పాకిస్థాన్ హై కమిషన్ ఆర్ధికంగా సహాయం చేస్తోందని నిర్ధారించారు. ఈ మేరకు వారు శుక్రవారం న్యూఢిల్లీ కోర్టులో3000 పేజీలతో కూడిన చార్జిషీట్ దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ JKLF నేత యాసిన్ మాలిక్ తో సహా మరో నలుగురు పై కేస్ నమోదు చేసింది. ఇతర దేశాల నుండి వచ్చిన సందేహాస్పద
ఈమెయిల్ లను, సంభాషణలు యాసిన్ మాలిక్, షబ్బీర్ షా ల అకౌంట్ నుండి స్వాధీనం చేసుకున్న ట్లు తెలియవచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.