News

బెంగాల్లో ఆర్.ఎస్.ఎస్ కుటుంబం దారుణ హత్య

318views

పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదా బాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త బొందు ప్రకాష్ పాల్ (35) ఆయన భార్య బ్యూటీ మండల్ పాల్ (30) వారి కుమారుడు ఆనంద్ (8)లను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. కాగా బ్యూటీ పాల్ నిండు గర్భవతి.

అందుతున్న వివరాల ప్రకారం ప్రకాష్ పాల్ ముర్షిదా బాద్ జిల్లా జియా గాంగ్ లోని లాబుట్ల అనే ప్రాంతంలో 5 సంవత్సరాలుగా కుటుంబంతో సహా నివసిస్తున్నారు. ఆయన సహాపూర్ ప్రైమరీ స్కూల్ లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం విజయ దశమి పండగ నాడు ఆయన ఉదయం 10 గంటల ప్రాంతంలో మార్కెట్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయం 11.30 నిముషాల ప్రాంతంలో వారి ఇంటి నుండి పెద్దగా ఆర్తనాదాలు వినపడటంతో పొరుగువారు వెళ్లి చూడగా కుటుంబమంతా రక్తపు మడుగులో పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. ఒక యువకుడు ఆ ఇంటి నుండి పారిపోవటం తాము చూశామని వారు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫోరె న్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు.

బొందు ప్రకాష్ ఫేస్బుక్ ప్రొఫైల్ ని బట్టి ఆయన దుర్గామాత భక్తుడని,తాను హిందువునని గర్వంగా భావిస్తాడని తెలుస్తోంది. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ అంతా ఆయన ఆ ఊరిలో సందర్శించిన దుర్గామాత మండపాల వీడియోలు, సేల్ఫీ లతో నిండి ఉంది. ముస్లిం ఆధిపత్యం ఉన్న ఆ ప్రాంతంలో కేవలం కొన్ని హిందూ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. గతంలో జరిగిన సంఘటనల కారణంగా కొన్ని సంవత్సరాల క్రితమే ఆ ప్రాంతం నుండి దాదాపుగా హిందువులందరూ వేరే ప్రాంతాలకు వెళ్లి పోయారు. అలాంటి ఈ ప్రాంతంలో బొందు ప్రకాష్ ఒక చురుకైన ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తగా వ్యవహరించడాన్ని సహించలేని ముస్లిం మతోన్మాదులు చేసిన పనిగా స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో మిగిలిన హిందువులను భయబ్రాంతులకు గురిచేసి ఆ ప్రాంతం నుండి తరిమివేసే ఉదేశ్యంతో ముస్లిం మతోన్మాదులు చేసిన హత్య ఇదని వారు ఆరోపిస్తున్నారు. తీవ్ర భయాందోళనలో వున్న స్థానిక హిందువులు తమకు రక్షణ కల్పించాలని, CBI దర్యాప్తుకు ఆదేశించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.