News

హిందువుల ఊరేగింపుపై ముస్లిముల రాళ్ళ దాడి – యు.పి లో ఘటన

114views

త్తర ప్రదేశ్ లోని బిజ్నూర్ జిల్లా విష్ణోయ్ వాలా అనే గ్రామంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పగులగొట్టబడ్డ హనుమంతుని విగ్రహం స్థానంలో మరొక కొత్త విగ్రహం ప్రతిష్టించేందుకు ఊరేగింపుగా వెళ్తున్న భక్తుల బృందంపై ముస్లింలు రాళ్ల దాడి చేశారు. ఈ సంఘటనలో 7గురు గాయపడ్డారు.

అందుతున్న వివరాల ప్రకారం – 3 నెలల క్రితం క్రుతునంగోలి రహదారిలో గల గుడిలో హనుమంతుని విగ్రహాన్ని కొందరు సంఘ విద్రోహ శక్తులు ధ్వంసం చేశారు. అయినప్పటికీ గ్రామస్థులెవరూ ఈ విషయంపై పోలీసు స్టేషన్లో పిర్యాదు చేయలేదు.

మంగళవారం విష్ణోయ్ వాలా కు చెందిన అనిల్ కుమార్, సమర్ సింగ్, ముకేష్ కుమార్ల ఆద్వర్యంలో గ్రామస్థులు నూతన హనుమంతుని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించటానికి ఊరేగింపుగా తరలిపోతున్న సందర్భంగా వారిపై ఈ దాడి జరిగింది.

షకీల్, సలీం, తాహిర్ ల ఆధ్వర్యంలోని ఒక గుంపు ఊరేగింపుకు అభ్యంతరం చెప్పింది. కానీ వారికి నచ్చజెప్పి ఊరేగింపు ముందుకు సాగింది. కానీ కోపోద్రిక్తులైన ముస్లిముల గుంపు ఊరేగింపుపై రాళ్ళు విసరగా ఆ దాడిలో 7 గురు భక్తులు గాయపడ్డారు. దురదృష్టవశాత్తూ ఈ దాడిలో నూతన విగ్రహం కుడా దెబ్బతిన్నది.

ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే ఇన్స్పెక్టర్లు సంజయ్ కుమార్, నాగిన అర్చన సింగ్ ల ఆధ్వర్యంలో పోలీసుల బృందం సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. BJP నాయకుడు అనూప్ వాల్మీకి, మరియు హిందూ యువ వాహినీ ఆధ్వర్యంలో వారి మద్దతుదారులు గ్రామస్థులతో కలిసి ఈ సంఘటన పై ఆందోళనకు దిగారు.

అందిన వివరాల ప్రకారం పోలీసులు మరో కొత్త విగ్రహం తెప్పించటమే కాక విగ్రహ పునఃప్రతిష్ఠ జరిపించేందుకు కూడా హామీ ఇచ్చారు.

పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి 18 మంది నిందితులను గుర్తించి అందులో 10 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు మహిళలు సైతం ఉండటం గమనార్హం. సాగిర్ ఆహ్మద్, నయీం, సాదిక్ ఆహ్మద్,రియాజ్ ఆహ్మద్,ఇర్ఫాన్ ఆహ్మద్, అస్గర్,షబానా,నైమ, మరియు షామ లను అరెస్ట్ చేయగా మిగిలిన వారికోసం గాలింపు చేపట్టారు.

పోలిసుల దర్యాప్తులో కొన్ని దిగ్బ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. కొన్ని ఇళ్ళపై రాళ్ళు, ఇటుకలు గుట్టలు గుట్టలుగా సిద్ధంగా ఉంచటాన్ని బట్టి ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి అని భావిస్తున్నారు. 2019, జూలై 31న ముస్లిం వర్గానికి చెందిన యువతులు ఆలయంలో  ప్రవేశించి అక్కడి విగ్రహాలను పగులగొట్టటం ఈ సంఘటనకు నేపథ్యంగా భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.