NewsProgramms

విజయవాడలో దక్షిణ భారత గో ఆధారిత వ్యవసాయదారుల సమ్మేళనం

139views

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వారు రెండు సంవత్సరాలకొకసారి విజయవాడలో నిర్వహించే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మూడవ ప్రదర్శనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 2015 ఆగస్టు 23న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల రాష్ట్ర సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా 2017 అక్టోబర్ 14వ తేదీన రెండవ రాష్ట్ర సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నందు “దక్షిణ భారత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల మరియు వినియోగదారుల మూడవ రాష్ట్ర సమ్మేళనాన్ని” నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే 4,5,6 (శుక్ర, శని, ఆది వారములు) తారీఖులలో జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం ఉంటుందని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం నేత శ్రీ వర్మ తెలిపారు.

5,6 తేదీలలో సిరిధాన్యాల వంటల పోటీలు, ఆరోగ్య సదస్సులు జరుగుతాయని, ఆర్గానిక్ ఫుడ్ కోర్ట్ మూడు రోజులూ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేళాని ప్లాస్టిక్ రహితంగా నిర్వహిస్తున్నామని, బ్యానర్లు కూడా బట్టతో తయారు చేసినవే వాడతామని శ్రీ వర్మ తెలిపారు. వివరాలకు 99 5128 2288 నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.