GalleryNews

సిసలైన దేశభక్తునికి ఘనమైన సత్కారం

91views

370 వ అధికరణం ఆరంభ ముగింపు అంకాల ప్రత్యక్ష సాక్షి, ప్రాణాలను సైతం లెక్క చేయక కాశ్మీర్ విమోచన ఉద్యమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా మైలవరం వాసి శ్రీ ఘంటా సీతారామయ్య దంపతులకు ఘన సత్కారం లభించింది.

శ్రీ సీతారామయ్య దంపతులు

వివిధ జాతీయ వాద సంస్థలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు మైలవరం గ్రామానికి వెళ్ళి సీతారామయ్యను ఘనంగా సత్కరించారు.

ప్రసంగిస్తున్న మాజీ మంత్రి శ్రీ రావెల కిశోర్ బాబు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ, మాజీ మంత్రివర్యులు శ్రీ రావెల కిశోర్ బాబు, బీజేపీ నాయకులు శ్రీ కిలారు దిలీప్, ప్రముఖ రచయిత శ్రీ దుగ్గరాజు శ్రీనివాస రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. 72 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో చీకటి తొలగి వెలుగు ఆవరించిందని, జమ్మూ కాశ్మీర్లో370 వ అధికరణం విధించినప్పుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ పిలుపుతో దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న శ్రీ సీతారామయ్య ఇప్పుడు ఆ అధికరణం తొలగించిన సందర్భంలో కూడా ఉండడం గొప్ప విషయమని, అలాంటి సాహసి, యోధుడు, దేశభక్తుడు, మహానుభావుడు మన మధ్య ఉండడం మనకు మహద్భాగ్యమని వక్తలు కొనియాడారు.

ప్రసంగిస్తున్న భాజపా నాయకులు శ్రీ కిలారు దిలీప్

ఈ కార్యక్రమంలో మైలవరం గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించబడి, దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న ఈ తరుణంలో 7 దశాబ్దాల క్రితం జరిగిన ఆ కాశ్మీర్ విమోచన ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి తమ మధ్యనే ఉన్నాడన్న సంగతి తమకు ఇన్నాళ్ళూ తెలియనే లేదంటూ మైలవరం గ్రామస్థులు ఒకింత బాధపడ్డం కనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా తమకు శ్రీ సీతారామయ్య గొప్పతనం తెలిపినందుకు అనేక మంది గ్రామస్థులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రసంగిస్తున్న ప్రముఖ రచయిత శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు

శ్రీ సీతా రామయ్య కుటుంబ సభ్యులతో భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.