
279views
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం 67,169 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,222 మంది తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా రూ. 3.86 కోట్ల రూపాయలు హుండీ కానుకలగా వచ్చాయి. ప్రతి సోమవారం స్వామివారికి నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతి సోమవారం విడిగా చతుర్దశ కలశ విశేష పూజను నిర్వహిస్తుంటారు. అయితే ఈ సోమవారం ఆ పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలియజేసింది.





