News

బీహార్‌లో లవ్ జిహాద్​ కేసు.. మతం మారాలంటూ మహిళపై వేధింపులు

413views

కతిహార్: లవ్​ జిహాద్​పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. ఆ తరహా ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. హిందూ యువతిని పెళ్ళి చేసుకున్న ముస్లిం యువకుడు మతం మారాల్సిందిగా ఒత్తిడి చేశాడు. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది.

పోలీసుల కథనం ప్రకారం.. బీహార్​ కతిహార్ జిల్లా​కు చెందిన తాకీర్​ ఆలాం దుబాయ్​లో ఉద్యోగం చేస్తున్నాడు. అర్చన అనే యువతికి 2015లో ఫేస్​బుక్​కు ద్వారా పరిచయం అయ్యాడు. ఆ క్రమంలో తాను ఓ హిందువునని.. తన పేరు రాజ్​ రాజ్​పుత్​గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. ​దుబాయ్​ నుంచి వచ్చిన తాకీర్.. అర్చనను తన కుటుంబ సభ్యుల మధ్య హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు.

కొద్ది రోజుల తర్వాత అర్చనను తన తన సోదరి ఇంటికి తీసుకెళ్ళాడు తాకీర్​. అప్పుడే అతడొక ముస్లిం అని.. అంతకముందే అతడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని అర్చనకు తెలిసింది. అప్పటినుంచి తాకీర్,​ అతడి కుటుంబ సభ్యులు అర్చనను తీవ్రంగా కొడుతూ, మతం మారమని ఇబ్బందులకు గురిచేశారు. “నేను ఒక హిందువు. నన్ను మోసం చేసి తాకీర్​ వివాహం చేసుకున్నాడు. పెళ్ళి తర్వాత తన సోదరి ఇంట్లో ఉంచాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాడు కాదు. ఇప్పుడు మతం మారమని నన్ను తీవ్రంగా హింసిచాడు.” అని అర్చన పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి