News

స్ఫూర్తిదాయకం… వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సాహసం!

476views

నంద్యాల: భారతదేశాన్ని ఆక్రమించిన శత్రువులను గడగడలాడించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సాహసం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. స్థానిక సంఘమిత్ర సేవా సమితిలో సంఘమిత్ర ఉపాధ్యక్షుడు జె. వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత విశేషాలు వివరించారు. ఆమె జీవితం నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు. శత్రువెంత బలవంతుడైనా మొక్కవోని ధైర్యంతో స్వాభిమానం కోసం అంతిమశ్వాస వరకు పోరాడటం… ఆమె ఈ సమాజానికిచ్చిన సందేశంగా తెలిపారు. మహిళలు రణరంగంలో విజృంభిస్తే అపరకాళీ అవతారమే అని నిరూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుడు, యోగా గురువు వెంకటేశ్వరి, ఉసిరికాయల రమణయ్యగౌడు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాలు, పెన్సిళ్ళ పంపిణీ

సేవాభారతి ఆధ్వర్యంలో నంద్యాల శివారు పీవీ నగర్‌లో నిర్వహించబడుతున్న అభ్యాసికలో విద్యార్థులకు చూచి రాత పుస్తకములు, పెన్సిళ్ళు పంపిణీ చేశారు. విభాగ్ కార్యకారిణి సదస్యులు డాక్టర్ కాదరబాద్ ఉదయశంకర్, సంఘమిత్ర సేవా సమితి కార్యవర్గ సభ్యుడు, వివి రమణయ్య, ఎం.వి.హరగోపాల్, సి.వంశీ మోహన్, వై.బాలాజీ, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి