
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సమావేశానికి వచ్చినవారిని ప్రత్యేకంగా పలకరించారు. కాశీ, తమిళనాడు భారతీయ నాగరికత, సాంస్కృతిక కేంద్రాలని, ఈ రెండు రెండు అతి ప్రాచీన సంస్కృత, తమిళ భాషల నిలయాలని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాశీలో 30 రోజుల పాటు ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. వారి వారి విభాగాలతో సంభాషించడానికి, స్థానిక నివాసితులతో సంభాషించడానికి ఏర్పాట్లు చేశారు.
తమిళ సంగమం సందర్భంగా కాశీ నగరం సంబరాలతో నిండిపోయింది. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా, ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ స్ఫూర్తిని నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం ఈ సంగమం నిర్వహిస్తోంది.
Source: Nijamtoday





