
367views
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన సామియా(7) అనే బాలిక అద్భుతమైన ఘనతను సాధించింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. పోటీలో పాల్గొన్న జపాన్, నేపాల్, బంగ్లాదేశ్ క్రీడాకారులను వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది. పోటీలో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ప్రత్యర్థులను చిత్తుచేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. “నాకు దేన్నైనా సాధించగలననే నమ్మకం వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడే నేను ఇప్పుడు కరాటే ప్రదర్శనతో ఎంతో ధైర్యంతో ఉన్నాను’ అని ఆ బాలిక ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.





