News

‘నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నీతో మాట్లాడుతా…’

322views

ముంబై: నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నీతో మాట్లాడుతానని మహారాష్ట్ర ఉద్యమకారుడు శంబాజీ భిడే ఓ మహిళా జర్నలిస్ట్‌తో అన్నారు. నిన్న సీఎం షిండేతో భేటీ అయిన భిడేను ఆ జర్నలిస్ట్‌ పలకరించి, మాట్లాడేందుకు ప్రయత్నించింది. అయితే, ఆయన.. ‘నన్ను ప్రశ్నించే ముందు బొట్టు పెట్టుకోవాలని తెలియదా?.. నీతో మాట్లాడను. మహిళలు భారతమాతతో సమానం. ఆమె విధవ కాదు. అందుకే భారత స్త్రీలు బొట్టు లేకుండా కనిపించకూడదు’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే, భిడే వ్యాఖ్యలపై ఎప్పటిలాగే కొంతమంది తమను తాము మేధావులుగా ఊహించుకుంటూ విమర్శలు గుప్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి