
342views
వాషింగ్టన్: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. వంతెన కూలిన సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు గుజరాత్ ప్రజలతో కలిసి సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బైడెన్ ట్వీట్ చేశారు. అదే విధంగా గుజరాత్ దుర్ఘటనపై అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ కూడా స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. తమ హృదయాలు భారత్‌తో ఉన్నాయని, క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకు మద్దతుగా ఉంటామని తెలిపారు.





