News

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు

426views

గాజియాబాద్​: ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో జరిగిన ఓ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ కోతి అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. నది ఉద్ధృతిగా ప్రవాహించడం వల్ల వానరం కొంత దూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వానరం నది మధ్యలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పట్టుకుని తన ప్రాణాలను కాపాడుకుంది. అనేక గంటల పాటు అంజనేయుడు చెంతనే ఉండిపోయింది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు నదిలోకి వెళ్లి వానరాన్ని రక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి