News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భక్తులు దుర్మరణం

313views

సోలాపుర్​: మహారాష్ట్ర సోలాపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి ఓ కారు వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం సంగోలా పట్టణంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో జరిగింది. “కొల్హాపుర్​ జిల్లాలోని జతర్​వాడీకి చెందిన 32 మంది భక్తులు పంధార్​పుర్​కు దైవ దర్శనానికి పాదయాత్ర చేస్తూ బయలుదేరారు. ఈ క్రమంలో సంగోలా చేరుకున్న వీరిపై ఓ కారు అదుపుతప్పి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించారు.” అని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి