News

ఆది దంపతులకు సహస్ర దీపాలంకరణ సేవ

370views

విజయవాడ: దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండుగగా జరిగింది. అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా పెద్ద ఎత్తున ఉభయదాతలు భక్తులు పాల్గొన్నారు. అనంతరం పల్లకి సేవ జరపగా అమ్మవారితోపాటు భక్తులు, ఆలయాధికారులు, సిబ్బంది ప్రధానాలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. అనంతరం దర్బార్‌ సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారికి అందించిన విరాళాలు చదివి వినిపించారు.

Source: way2news

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి