News

ఘనంగా పైడితల్లి సిరిమానోత్సవం

345views

విజ‌య‌న‌గ‌రం: ఉత్తరాంధ్ర క‌ల్పవ‌ల్లి.. విజ‌య‌న‌గ‌రం ప్రజ‌ల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. సంప్రదాయ‌బద్దంగా అంజలి రథం, జలారివల, తెల్లఏనుగు, పాల‌ధార‌ ముందు న‌డ‌వ‌గా.. భ‌క్తుల జ‌య‌జ‌య ద్వాణాల మ‌ధ్య పైడిత‌ల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను రూపంలో ముమ్మారు ఊరేగి ప్రజలను ఆశీర్వదించారు. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమానుపై పైడిత‌ల్లి ఆల‌య ప్రధాన పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు ఆశీనులై, భ‌క్తుల‌కు ద‌ర్శనమిచ్చారు. సిరిమాను రూపంలో పైడిత‌ల్లి అమ్మవారు.. త‌న పుట్టినిల్లు విజ‌య‌న‌గ‌రం కోట‌ వ‌ద్ద వరకు మూడుసార్లు ఊరేగి.. రాజు కుటుంబానికి దీవెన‌లు అందించారు. ఈ మహోత్తమమైన ఘట్టానికి తిలకించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. ఈ అపూర్వ ఘ‌ట్టాన్ని ప్రత్యేక్షంగా తిల‌కించి శరణు శరణు పైడిమాంబ అంటూ పరిడమిల్లారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి