News

బంజారాహిల్స్‌లో రూ. 2.4 కోట్ల హవాలా సొమ్ము స్వాధీనం

318views

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లో భారీ మొత్తంలో హవాలా సొమ్మును పట్టుబడింది. బుధవారం ఉదయం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 12లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదు బయటపడింది.

డబ్బును తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు నగదును సీజ్ చేశారు. డబ్బుతో పాటు నిందితులను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. రూ.2.4 కోట్ల హవాలా డబ్బుతో పట్టుబడ్డ కారును గుజరాత్‌కు చెందిన వ్యాపారి వ్యాస్ నవీచంద్ర భోగిలాల్దిగా గుర్తించారు.

మార్వెల్ మెడోస్ అపార్ట్ మెంట్, రామ్ కోఠి అడ్రస్ తో కారు రిజిస్టర్ అయినట్టు పోలీసులు చెప్పారు. నిందితులు బిజినెస్ నిమిత్తం ఈ డబ్బు తీసుకెళ్తున్నట్టు చెప్పినా అందుకు తగ్గ సాక్ష్యాధారాలు చూపకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి